- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Health tips : రోగ నిరోధక శక్తిని పెంచే నేచురల్ ఫుడ్స్.. ఏవి ఎలాంటి ప్రయోజనం కలిగిస్తాయంటే..
దిశ,ఫీచర్స్ : వాతావరణం మారుతున్న క్రమంలో పలు సీజన్ వ్యాధులు (Seasonal diseases) తలెత్తుతుంటాయి. ముఖ్యంగా చలికాలంలో అలాంటి అవకాశం ఎక్కువ. రోగ నిరోధక శక్తి తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే ఇంటిలోనే లభించే కొన్ని సహజమైన ఆహారాలు, పానీయాలు, సుగంధ ద్రవ్యాలను డైట్‌లో ఉపయోగించడంవల్ల ఇమ్యూనిటీ పవర్ (Immunity power) పెంచుకోవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. అవి ఏవి? ఎలాంటి పోషకాలు ఉంటాయి? ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం.
* పసుపు : మనం ప్రతిరోజూ వంటకాల్లో వాడే ముఖ్యమైన పదార్థాల్లో పసుపు ఒకటి. ఇందులో కర్క్యూమిన్ (Curcumin) అనే పదార్థంతోపాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా చలికాలంలో తలెత్తే ఇన్ ఫెక్షన్లను, వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. గోరు వెచ్చని పాలల్లో చిటికెడు పసుపు కలుపుకొని తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
* అల్లం, వెల్లుల్లి : ఎప్పుడూ అందుబాటులోనే ఉండే అల్లంలో ఔషధ గుణాలు ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండటంవల్ల జలుబును తగ్గిస్తుంది. అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్స్ అజీర్తి, కడుపు ఉబ్బరం సమస్యలు దూరం చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా వ్యాధుల నివారణగా పనిచేస్తుంది. అల్లం టీలలో, కూరల్లో వాడటం త్వారా ఉపయోగిస్తారు. ఇక వెల్లుల్లిలోనూ అల్లిసిన్ అనే పదార్థం ఉంటుంది. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉన్నందున అనారోగ్యాలను దూరం చేస్తుంది.
* సిట్రస్ ఫ్రూట్స్ (Citrus fruits) : విటమిన్ సి కలిగి ఉండే నిమ్మ, దానిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లను చలికాలంలో తినడం మంచిది. వీటిలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిండెంట్ల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, ఫ్లూ, జలుబు, ఇన్‌ఫెక్షన్లు తగ్గడంలో సహాయపడతాయి. అలాగే పాలకూర, తోట కూర, బచ్చలి కూర వంటి ఆకు కూరల్లో విటమిన్ ఎ, సి, కె ఉంటాయి. వీటిని కూరలుగా వండి తినడంవల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే బాదం, యోగర్ట్, స్ట్రాబెర్రీస్ వంటివి తినడం ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి.
* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.