- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
52 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్..?
దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం కామన్ అయిపోయింది. అలాగే కొందరు చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసుకుని విడిపోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఇండస్ట్రీలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఐదు పదుల వయసు దాటినా కొందరు పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉన్నవారు కూడా ఉన్నారు. ఊహించని విధంగా సీక్రెట్‌గా డేటింగ్ చేసి వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. ఈ నేపథ్యంలో.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ టబు( Tabu ) 52 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరో కాదు.. సీనియర్ హీరోయిన్ టబు( Tabu ). ఒకానొక సమయంలో టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి యూత్ కలల రాణిగా మారిపోయింది.
అప్పట్లో ఆమెను చూస్తే కుర్రాళ్లు థియేటర్స్‌లు పూనకాలు వచ్చినట్లు ఊగిపోయేవాళ్లు. అయితే టబు ‘కూలీ నెం 1’(Coolie No 1) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుని ‘నిన్నే పెళ్ళాడుతా(Ninne Pelladata), ఆవిడ మా ఆవిడ’ వంటి చిత్రాల్లో నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పలువురితో టబు ప్రేమలో పడినట్లు పలు పుకార్లు వచ్చాయి. కానీ కొంతకాలానికి అవన్నీ రూమర్స్‌గానే మిలిగిపోయాయి.
ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా టబు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే.. తాజాగా టబు పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిందని తెలుస్తోంది. ఆమె కంటే వయసులో చిన్నవాడితో ప్రేమలో ఉన్నారని, తొందరగానే వీరు పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారని వార్తలు జోరుగా వస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇక టబు ఫ్యాన్స్ మాత్రం అవన్నీ పుకార్లు అని కొట్టిపారేస్తున్నారు.