- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Revanth Reddy: తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను మరోసారి పరిశీలించిన సీఎం
దిశ, వెబ్ డెస్క్: డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ(Secretariat) ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం(Telangana Talli statue) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 9న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉండటంతో దీనికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విగ్రహ ఏర్పాటు పనులను మరోసారి పరిశీలించారు. రెండు రోజుల క్రితం విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రాంతాన్ని సందర్శించిన ఆయన మరోసారి పనుల పురోగతిపై ఆరా తీశారు.
సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి(CM Advisor Vem Narender Reddy), ప్రభుత్వ సలహాదారు కెఎస్. శ్రీనివాసరాజులతో(Government Advisor KS. Srinivasa Raju) కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం పలు సూచనలు(Suggestions) చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుతోంది. ఇందులో భాగంగా వచ్చే నెల 9న ఏఐసీసీ అగ్రనేతలతో పాటు లక్ష మంది మహిళలతో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని తలిచారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ఢిల్లీకి వెళ్లి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.