- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొడుకులకు సర్కారు నౌకరిలు..అన్నం పెడ్తలేరని తండ్రి కన్నీళ్లు
దిశ,సూర్యాపేట టౌన్; ఆకలి అవుతుంది..పట్టెడు అన్నం పెట్టండి..అని ఓ తండ్రి పడుతున్న ఆవేదన నలుగురుని కలిచివేసింది. ఈ సంఘటన సోమవారం సూర్యా పేట పట్టణంలో 60 ఫీట్ రోడ్డు సాయి కళ్యాణ్ అపార్ట్మెంట్ దగ్గర చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..పెన్ పహాడ్ మండలం లింగాల గ్రామానికి చెందిన మామిడి అంజయ్య గౌడ్ వ్యవసాయంతో పాటు.. కల్లుగీత పనిచేసేవాడు. తన భార్య 3 సంవత్సరాల క్రితం చనిపోయింది. పెద్ద కొడుకు టీచర్, రెండో కొడుకు కూలి పని చేస్తాడు,మూడో కొడుకు కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఈ ముగ్గురు కొడుకులు తండ్రికి పట్టెడు అన్నం పెట్టలేక రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని తండ్రి కలెక్టర్ కి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం సూర్యాపేట ఎల్ ఐ సీ ఆఫీస్ ప్రక్కన అఫార్ట్మెంట్ వద్ద వృద్ధుడు రోడ్డు పక్కన పడుకొన్నాడు. చలించిన స్థానికులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.