- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Suryapet Collector : డిమాండ్ ఉన్న ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేయాలి
దిశ,నాగారం: ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేసినట్లు అయితే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మండల పరిధిలో నీ ఫణిగిరి గ్రామం లో కమటం జయమ్మ పిలిప్స్ నూతనంగా సాగు చేస్తున్నటువంటి ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమంను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్ తోటలను సాగు చేసి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని తెలిపారు.ఆయిల్ పామ్ తోట నాటిన నాలుగవ సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది అని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం బిందు సేద్యం, ఎరువులకి, అంతర పంటలకు రాయితీలు ఇస్తుందన్నారు. ఎరువులు మరియు అంతర పంటల యాజమాన్యానికి ఒక ఎకరానికి రూపాయలు 4200/- చొప్పున మొదటి నాలుగు సంవత్సరాలు ప్రోత్సాహకం ఇవ్వబడును. గరిష్టంగా ఒక రైతుకు 12:50 ఎకరాల వరకు డ్రిప్పు రాయితీ వర్తిస్తుందని, నీటి వసతి గల రైతులు లాభదాయకమైన ఆయిల్ పామ్ పంటను సాగు చేసి, అధిక ఆదాయం పొందవచ్చునని తెలిపారు. ఒక ఎకరానికి దిగుబడి పది టన్నుల వరకు వస్తుందనీ మొదటి నాలుగు సంవత్సరాల వరకు అంతర పంటలుగా ప్రస్తుతం మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న కూరగాయలను, వాణిజ్య పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.ఆయిల్ పామ్ తోటలు సాగు చేయాలనుకున్న ఆసక్తి గల రైతులు ఉద్యాన శాఖ అధికారులకు దరఖాస్తు చేయాలని కోరారు.
రుణమాఫీ కానీ రైతులు ఎవరు అధైర్య పడవద్దని మండలంలోని వ్యవసాయ అధికారులకు వ్యవసాయ విస్తరణ అధికారులకు రుణమాఫీ కానీ వారు వివరాలు ఇచ్చినట్లు అయితే వాటిని పరిష్కారం చేస్తామన్నారు. రెండు లక్షలు పైన రుణం ఉన్న రైతులు బ్యాంకు వారికి మీరు కట్టవలసిన ఋణం చెల్లించినట్లు అయితే ప్రభుత్వం చేయవలసిన రెండు లక్షలు మాఫీ అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ ఉద్యాన అధికారులు ఎం మహేష్, ప్రమిత , మండల వ్యవసాయ అధికారి కృష్ణకాంత్,పతంజలి ఆయిల్ ఫామ్ డీజీఎం బి యాదగిరి, మేనేజర్ హరీష్, ఫీల్డ్ ఆఫీసర్ అశోక్,క్షేత్ర సహాయకులు రంగు ముత్యం రాజు, భద్రాచలం,కరుణాకర్ రైతులు రవీందర్, అశోక్ రెడ్డి, మల్యాల అశోక్, జలెండర్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.