- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తండ్రి మందలించడంతో కొడుకు ఆత్మహత్య
దిశ, చేగుంట : వర్షం పడుతుంది ఎక్కడ తాగుకుంటూ కూర్చున్నావు అంటూ తండ్రి కొడుకును మందలించడంతో మనస్థాపం చెందిన కొడుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చేగుంట మండల పరిధిలోని రుక్మాపూర్ గ్రామానికి చెందిన బోయిని శ్రీనివాస్( 28) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రోజు బోయిని శ్రీనివాస్ మద్యం సేవించగా తండ్రి స్వామి మందలించాడు. వ్యవసాయ పనులు చేసి సేద తీరుతున్నప్పటికీ తండ్రి స్వామి మందలించడంతో మనస్థాపం చెందిన శ్రీనివాస్ చిటోజ్ పల్లి శివారులోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు శ్రీనివాస్ కు భార్య జ్యోతి, ఏడు సంవత్సరాల లోపు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. చేగుంట పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.