Cyber Fraud: వ్యాపారి సిమ్ స్వాప్ చేసి రూ. 7.5 కోట్లు కొట్టేసిన సైబర్ మోసగాళ్లు

by S Gopi |
Cyber Fraud: వ్యాపారి సిమ్ స్వాప్ చేసి రూ. 7.5 కోట్లు కొట్టేసిన సైబర్ మోసగాళ్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో సైబర్ మోసగాల దోపిడీ కొనసాగుతూనే ఉంది. సామాన్యులను వివిధ మార్గాల్లో బెదిరించి, మభ్యపెట్టి కోట్లాడి రూపాయలను దోచుకుంటూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వాధికారుల పేరు చెప్పి దోచుకునే పద్ధతిని స్కామర్లు అనుసరిస్తున్నారు. తాజాగా బుధవారం ఏకంగా ఓ వ్యాపారవేత్త నుంచే సైబర్ మోసగాళ్లు సొమ్ము దోచుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన ఓ కంపెనీ యజమాని సిమ్ కార్డును స్వాప్ చేసి రూ. 7.5 కోట్లు కొట్టేశారని అధికారులు వెల్లడించారు. నెట్‌వర్క్ ప్రొవైడర్‌ను మోసగించి, వ్యాపారవేత్త మొబైల్ నంబర్ ఉన్న సిమ్ కార్డుకు లింక్ చేసి, బ్యాంకు ద్వారా వచ్చే ఓటీపీలను కనుక్కున్నారు. ఆ తర్వాత బాధితుడి బ్యాంకు అకౌంట్లోని సొమ్మును బదిలీ చేసుకున్నారు. తనకు తెలియకుందా బ్యాంకు అకౌంట్ నుంచి సొమ్ము బదిలీ కావడాన్ని గుర్తించిన వ్యాపారవేత్త అప్రమత్తమై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన అధికారులు బ్యాంక్ నోడల్ అధికారుల సాయంతో నేషనల్ సిబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు అందించారు. సైబర్ పోలీస్ బృందం ఆలస్యం చేయకుండా అప్రమత్తమై స్కామర్ల నుంచి రూ. 4.65 కోట్లను ఫ్రీజ్ చేశారు. మిగిలిన మొత్తాన్ని స్కామర్లు వివిధ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేశారు. దీంతో ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed