- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌కు వచ్చిన డీకే.. ఓ ప్రైవేట్ ఫంక్షన్‌కు హాజరు
దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్ ఇవాళ హైదరాబాద్ కు వచ్చారు. సిటీలోని ఓ ప్రైవేట్ ప్రోగ్రాం నిమిత్తం వచ్చిన ఆయనను పీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ బుధవారం బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు. అనంతరం కొద్ది నిమిషాల పాటు స్టేట్ పార్టీ, ప్రభుత్వ పని తీరు వంటి విషయాలపై డీకే ఆరా తీశారు. ఏడాదిలో సాధించిన విజయాలను పీసీసీ చీఫ్,డీకేకు వివరించారు. ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన డీకే, ప్రభుత్వాన్ని అభినందించారు. ఇక నేడు కర్ణాటక రాష్ట్రం బెల్గంలో సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హాజరు కానున్నారు.
గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీడబ్ల్యూసీ దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, సీడబ్ల్యుసీ సభ్యులు వంశీచందర్ రెడ్డి వెళ్లనున్నారు. వీరంతా రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బెల్గాంకు వెళ్లనున్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. దీంతో పాటు రాష్ట్రాల వారీగా పార్టీ పరిస్థితులను తెలుసుకోనున్నారు. అనంతరం రాహుల్‌ను పీఎంను చేసేందుకు అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాల్సిన కార్యక్రమాలను సీడబ్ల్యూసీ మీటింగ్‌లో ఫిక్స్ చేయనున్నారు. ఇందు కోసం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ఏం చేయాలి..? దేశ వ్యాప్తంగా కోఆర్డినేషన్ ఎలా ఉండాలి..? వంటి అంశాలపై కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉందని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత వెల్లడించారు.