- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీట్ పీజీ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లెటర్
దిశ, తెలంగాణ బ్యూరో: నీట్ పీజీ మెరిట్ లిస్టును వెంటనే రిలీజ్ చేయించాలని సీఎం రేవంత్ రెడ్డికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లెటర్ రాసింది. ఇప్పటికే కౌన్సిలింగ్ ఆలస్యమైందని, నీట్ పీజీ 2024 అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నట్లు వివరించారు. మెరిట్ లిస్ట్, సీట్ మ్యాట్రిక్స్ ప్రకటించి, కౌన్సిలింగ్ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 2 కౌన్సిలింగ్ జరుగుతుందని, కానీ మన స్టేట్ లో కనీసం మెరిట్ లిస్ట్ కూడా విడుదల కాకపోవడం విచిత్రంగా ఉన్నదని తెలంగాణ స్టేట్ ఐఎంఏ డాక్టర్లు ద్వారకాంత రెడ్డి, అశోక్, దయాల్ సింగ్ లు లెటర్ లో వివరించారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలు ప్రకారం ఇప్పటికే డిసెంబర్ 26 కు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా పూర్తి కావాల్సి ఉందని వివరించారు. కానీ తెలంగాణలో ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. కారణాలు ఏమైనా కావొచ్చని, కానీ కౌన్సిలింగ్ ఆలస్యంతో తెలంగాణ స్టూడెంట్లకే నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రత్యేక దృష్టి పెట్టి పీజీ కౌన్సిలింగ్ వేగంగా జరిగేలా కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి ఆదేశాలు ఇవ్వాలని ఐఎంఏ డాక్టర్లు కోరారు.