తలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఇంట్లో విషాదం..

by Aamani |
తలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఇంట్లో విషాదం..
X

దిశ,తలకొండపల్లి : మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన డోకూరు నరేందర్ రెడ్డి అనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుధవారం ఉదయం హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. నరేందర్ రెడ్డి గత కొన్ని రోజులుగా బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో మృతి చెందినట్లు తెలిపారు. తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డోకూరు ప్రభాకర్ రెడ్డికి సొంత అన్న మృతిచెందడంతో పడకల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నరేందర్ రెడ్డి ఇద్దరు కూతుర్లు కెనడాలో ఉండడం వల్ల గురువారం రాత్రి వరకు హైదరాబాద్ చేరుకుంటారని, అంత్యక్రియలను ఈనెల 27న మధ్యాహ్నం పడకల్ గ్రామంలోని నిర్వహించబడనని ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed