జిల్లా కేంద్రంలో గుట్టుగా వ్యభిచారం.. యువత, మందుబాబులే లక్ష్యం

by Shiva |
జిల్లా కేంద్రంలో గుట్టుగా వ్యభిచారం.. యువత, మందుబాబులే లక్ష్యం
X

దిశ సూర్యాపేట టౌన్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత కొద్దిరోజులుగా వ్యభిచారం గుట్టుగా సాగుతోంది. జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రాంతాలు వ్యభిచారాలకు అడ్డగా మారుతున్నాయి. గంజాయి తీసుకుంటున్న యువతను, మందుబాబులను లక్ష్యంగా చేసుకొని వ్యభిచార గృహాలను కొంతమంది నిర్వహిస్తున్నారు. గత కొద్దిరోజులుగా వ్యభిచార గృహాలను కొంతమంది మహిళలు నిర్వహించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. హైదరాబాద్, విజయవాడ‌కు చెందిన కొంతమంది యువతులను సూర్యాపేటకు తీసుకువచ్చి వారితో వ్యభిచారం సాగిస్తున్నారు. వివిధ కళాశాలలకు చెందిన యువకులను వ్యభిచార గృహాలకు అలవాటు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరంతరం పోలీసులు గస్తీలు నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలు నిర్భయంగా నిర్వహిస్తుండటం పలు అనుమానాలను తావిస్తోంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గుట్టుగా సాగుతున్న వ్యభిచారం‌పై ‘దిశ’ ప్రత్యేక కథనం.

యువకులు, మందుబాబులే లక్ష్యంగా..

సూర్యాపేట జిల్లాలో కేంద్రంలో యువకులు, మందుబాబులను లక్ష్యంగా చేసుకుని వ్యభిచార గృహాలను నడిపిస్తున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, ఇంటర్మీయట్ కళాశాలలో చదువుతున్న కొంతమంది యవకులను టార్గెట్ చేసుకుని వారిని వ్యభిచార గృహాలకు రప్పిస్తున్నారు. తొలుత ఒకరు ఇద్దరు యువకులకు వ్యభిచార గృహాలను పరిచయం చేస్తారు. ఆ తర్వాత కొద్ది రోజులుకు వారి చేతనే మరి కొంతమందికి ఈ వ్యభిచార గృహాలకు పరిచయం చేస్తున్నారు. డబ్బు, ఆర్థిక పలుకుబడి కలిగిన కొంతమంది యువకులే ఈ వ్యభిచార గృహాలకు రెగ్యులర్ కస్టమర్లుగా మారుతున్నారు. సూర్యాపేటకు అతి సమీపంలో ఉన్న ఒక పట్టణానికి చెందిన కొంతమంది యువతులను తీసుకువచ్చి వ్యభిచార రాకెట్‌ను గుట్టుగా సాగిస్తున్నారు. యువకుల తర్వాత మందుబాబులు వ్యభిచార గృహాల భారీన పడుతున్నారు. గతంలో ఈ వ్యభిచార గృహాలకు కస్టమర్‌గా మారిన మందుబాబులను వ్యభిచార గృహాలకు పంపే మధ్యవర్తి వ్యభిచార గృహాలకు కొత్తగా వచ్చిన యువతుల ఫొటోలను ఫోన్‌లో మందుబాబులకు చూపిస్తాడు. కస్టమర్‌కు ఫొటో‌లో ఉన్న యువతి నచ్చితే అక్కడే రేట్‌ను మాట్లాడుతారు. ఎక్కడకు రావాలి, ఎంతమంది రావాలి అనే విషయాలను వ్యభిచార గృహాలకు మధ్యవర్తిగా వ్యవహరించే వ్యక్తి చూసుకుంటాడు.

ఈ ప్రాంతాల్లోనే..

సూర్యాపేట జిల్లాలో కేంద్రంలోని జనగాం క్రాస్ రోడ్డు, కొత్త బస్ స్టాండ్ దగ్గరలో, క్రిష్ణ టాకిస్ రోడ్డు, ఖమ్మం క్రాస్ రోడ్డు, కుడ కుడ రోడ్డు, ఇందిరమ్మ కాలనీ, నూతన వ్యవసాయ మార్కెట్ శివారు ప్రాంతాల్లో వ్యభిచార గృహాలను కొంతమంది అత్యంత రహస్యంగా కొనసాగిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కొత్త మార్కెట్ కాలువ దగ్గర ఒక వ్యభిచార గృహంలోని యువతి కోసం ఇద్దరి యువకుల మధ్యల పరస్పర వాగ్వాదం జరగింది. అక్కడికి పోలీస్ వాహనం రావడంతో వెంటనే యువకులు అక్కడి నుంచి పరిగెత్తారు. కొత్త బస్టాండ్ దగ్గరలో ఇలాంటి ఘటన జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఇలా ఇరుగు పొరుగు వారికి ఎలాంటి అనుమానాలు రాకుండా చాలా గుట్టుగా గత కొద్దిరోజులుగా వ్యభిచార గృహాల నిర్వహణ సాగుతోంది. వ్యభిచార గృహాలకు తరచుగా వచ్చే యువకులకు ముందుగా ఫోన్ చేసి సమాచారం అందిస్తారు. ఏ సమయంలో ఎక్కడకు రావాలి? ఎంతమంది వరకు రావాలి.. ఎంత ధర ? తదితర అంశాలు అన్ని వ్యభిచార గృహాలకు, కస్టమర్లకు మధ్యవర్తి నిర్వహించే వ్యక్తులే మాట్లాడుతారు. చివరి క్షణం వరకు కూడా కస్టమర్‌కు వ్యభిచార గృహాం వివరాలు వెల్లడించరు. బంధువుల రూపంలో కస్టమర్లను వ్యభిచార గృహాలకు తీసుకుపోతుంటారని తెలుస్తోంది. ఇరుగుపోరుగు వారికి తమ ఇండ్ల పక్కన వ్యభిచారం నడుస్తుందని ఎలాంటి అనుమానులు కలగకుండా వ్యభిచార గృహాలను నడుపిస్తుండటం గమనార్హం.

చెడు వ్యసనాల బారిన పడుతోన్న యువత

వ్యభిచార గృహాలకు అలవాటు పడిన యువత, వ్యభిచారం ఒక వ్యసనంగా మారుతుంది. ఇప్పటికే మద్యం, గంజాయి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న యువతకు వ్యభిచారం మరో వ్యసనంగా మారుతుంది. ఒక్కసారి వ్యభిచార గృహాలకు వెళ్లిన యువత అక్కడ ఉన్న యువతులతో పరిచయం పెంచుకుంటున్నారు. ఫోన్ నెంబర్లు తీసుకోవడం, వాటితో చాటింగ్, లైవ్ వీడియోల బారిన పడుతున్నారు. శరీర సుఖం తీర్చుకోవడం కోసం యువకులు ఈ వ్యభిచార గృహాలకు అలవాటు పడుతున్నారు. తమ కోర్కెలను తీర్చుతున్న యువతులతో పరిచయం చేసుకుంటున్నారు. తొలుత ఫోన్ నెంబర్లు మార్చుకోవడం ఆ తర్వాత వారితో చాటింగ్ చేయడం ప్రారంభిస్తున్నారు. నెమ్మదిగా వారిలో కోరికలు కలిగే విధంగా మాట్లాడటం, ఆ కోరికలు తీర్చుకోవడం కోరకు వ్యభిచార గృహాలకు వెళ్తున్నారు. ఆర్థిక పరిపుష్టి కలిగిన యువకులు, వ్యక్తులనే టార్గెట్‌గా పెట్టుకుని వారి నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిత్యం పెట్రోలింగ్ చేస్తున్నాం: రవి డీఎస్పీ

సూర్యా పేట జిల్లా కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేదు. జిల్లా కేంద్రంలో ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ చేస్తున్నాం. వ్యభిచార గృహాలు ఉన్నట్లుగా మా దృష్టికి రాలేదు. అలా ఏమైనా ఉంటే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. యువత చెడు వ్యసనాలకు బారిన పడి బంగారు భవష్యత్తును నాశనం చేసుకోవద్దు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో అన్ని సెంటర్లలో పూర్తి నిఘా పెట్టాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

Advertisement

Next Story

Most Viewed