ఘనంగా శివరాత్రి పూజలు.. పాల్గొన్న ప్రముఖులు

by Kalyani |
ఘనంగా శివరాత్రి పూజలు.. పాల్గొన్న ప్రముఖులు
X

దిశ, మిర్యాలగూడ: మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా నియోజకవర్గ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్ల వారు జామునుంచే శివాలయాలు భక్తులతో కిటకిట లాడాయి. ఉత్సవాల నిర్వహణకు ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేశాయి. మహా శివరాత్రి పురస్కరించుకొని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వాడపల్లి మీనాక్షి అగస్తేశ్వర స్వామి, అడవిదేవులపల్లి పంచాయతన సోమేశ్వర స్వామితో పాటు పట్టణంలోని భ్రమరాంబ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు.

ఆయన వెంట మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన, మజ్జిగ పంపిణీని ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed