- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గంజాయి చాక్లెట్ల పట్టివేత
దిశ, కోదాడ : పట్టణంలో గంజాయి విరివిగా దొరుకుతుండడంతో పోలీసులు పూర్తిస్థాయిలో నిఘా ఉంచి చాలా వరకు కంట్రోల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురుపై కేసులు నమోదు చేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ ఆంధ్ర ప్రాంతం నుంచి గంజాయి డ్రగ్స్ రవాణా అవుతున్న నేపథ్యంలో..పోలీసులు పూర్తిస్థాయిలో భద్రతను పెంచారు. న్యూ ఇయర్ వేడుకలలో భాగంగా ఎక్సేంజ్ సిఐ శంకర్ ఆధ్వర్యంలో..ప్రతి వాహనానికి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తనిఖీలు భాగంగా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద ప్రైవేట్ బస్సులో డ్రగ్స్ ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్ నుండి హైదరాబాద్ వెళుతున్న బస్సులో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 25 చాక్లెట్ల ప్యాకెట్ల లలో 1000 చాక్లెట్లను గుర్తించి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఆరుగురు అనిల్ కుమార్, రజని బన్ కిమ్ , మామిటూ నాయక్, సాజీబాని, జాను నాయక్ వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లుగా ఎక్సైజ్ శంకర్ తెలిపారు. నిందితులలో ఇద్దరు పురుషులు నలుగురు మహిళలు ఉన్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు గోవర్ధన్, రామకృష్ణ, యాదయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు