- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మూడు నెలలైనా అందని పట్టా బుక్కులు..
దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం) : రైతులకు ఇబ్బందులు కలగకుండా నిమిషాల్లో పట్టా మార్పిడి, మ్యుటేషన్, అరచేతిలో పాస్ బుక్ అని ధరణి గురించి గొప్పగా ఊదరగొట్టారు. కానీ, నేడు వాస్తవంలో మాత్రం దానికి భిన్నమైన పరిస్థితి. ధరణిలో నూతనంగా పట్టాలు చేసుకున్నా, తల్లిదండ్రులను కోల్పోయిన వారు వారసత్వంగా పట్టా చేయించుకున్నా, గిఫ్ట్ చేయించుకొని పాసు పుస్తకాల కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పట్టా పుస్తకాలు అందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.
పట్టా పుస్తకాలు ఎన్నడు వస్తాయా.. వాటి పై పంట రుణం, మార్టిగేజ్ రుణాలు ఎప్పుడు తీసుకుందామా అని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. పట్టా మార్పిడి కోసం చలానాకు చేసిన అప్పులను తీర్చలేక, రుణం పొందలేక రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. తహశీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతూ అధికారులను వాకబు చేస్తే అవి ఎక్కడ ముద్రిస్తారో, ఎప్పుడు వస్తాయో మాకు తెల్వదు, మీ ఇంటికి పోస్టులో వస్తాయని అంటున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా మండల వ్యాప్తంగా అనేక మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టా పుస్తకాలను త్వరితగతిన ముద్రించి అన్నదాతలకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
పాస్ బుక్ రాక లోన్ ఆగింది : అంకిరెడ్డి యాదగిరి, రైతు
మా నాన్న పేరు మీద ఉన్న భూమిని ధరణిలో ఈ ఏడాది ఆగస్ట్ నెలలో పట్టా చేయించుకున్నా. మూడు నెలలైనా ఇప్పటికీ పట్టా బుక్ రాలేదు. పంట రుణం కోసం అన్నీ సిద్ధం చేసుకొని, బ్యాంకు కెళితే ఒరిజినల్ బుక్ వచ్చాక ఇస్తామంటున్నారు. పాస్ బుక్ రాక, లోన్ ఆగడంతో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నా. ఇప్పటికైనా వెంటనే పాస్ బుక్స్ పంపిణీ చేసి, రైతులను ఆదుకోవాలి.