Nalgonda SP : గంజాయి రహిత సమాజమే లక్ష్యం

by Aamani |
Nalgonda SP : గంజాయి రహిత సమాజమే లక్ష్యం
X

దిశ, నార్కట్ పల్లి : గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా నెరవేర్చేందుకు అందరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని తోటి విద్యార్థులను సోదర భావంతో చూసుకోవాలన్నారు. మిషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా కామినేని మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన మాదకద్రవ్యాల నిర్వహణ యాంటీ డ్రగ్స్ ఈవిటీజింగ్ వాటికి వ్యతిరేకంగా నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గంజాయి రవాణా దారులపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపిందన్నారు.

ఇప్పటికే ఎన్నో గంజాయి కేసులను చేదించామని ఎవరైనా గంజాయి విక్రయాలు చేస్తే సమాచారం అందిస్తే వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తమ జీవితాలను చక్కదిద్దుకోవాలని తల్లిదండ్రులకు గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. ర్యాగింగ్ చేయడం నేరమని గుర్తుంచుకోవాలన్నారు. ర్యాగింగ్ చేసినట్లు రుజువైతే మూడేళ్ల శిక్ష తప్పదు అన్నారు. ఇవి టీజింగ్ చేస్తే వెంటనే షీ టీం బృందాలకు సమాచారం అందించాలన్నారు. సోషల్ మీడియా పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఫేస్బుక్ వాట్సప్ ట్విట్టర్ లో ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే సమాచారం తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, సైబర్ క్రైమ్ డిఎస్పి లక్ష్మీనారాయణ, షీ టీం ఇన్చార్జి సీఐ కరుణాకర్, నార్కట్ పల్లి సిఐ, ఎస్ఐ నాగరాజు, క్రాంతి, మెడికల్ డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ బాబాసాహెబ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story