నీటిలో మునిగిన మున్సిపాలిటీ ఆఫీసు.. తడిసి ముద్దైన రికార్డులు

by Nagam Mallesh |
నీటిలో మునిగిన మున్సిపాలిటీ ఆఫీసు.. తడిసి ముద్దైన రికార్డులు
X

దిశ, కోదాడః కోదాడ పట్టణంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసినప్పటికీ సాయంత్రం 6 గంటల నుండి వాన విస్తారంగా కురిసింది. కోదాడలో 135.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందంటే వర్షం ఏ మేర కురిసిందో అర్థమవుతుంది. విస్తారంగా కురుస్తున్న కుండ పోత వర్షంతో కోదాడ మున్సిపల్ కార్యాలయం లోని ఇంజనీరింగ్ విభాగంలోకి మూడు అడుగుల మేర వర్షపు నీరు చేరడంతో కోట్లాది రూపాయల విలువ చేసే రికార్డులు తడిసిపోయాయి. మున్సిపల్ పరిధిలోని కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన ఎంబీలు, నిధులకు సంబంధించిన రికార్డులు తడిసి ముద్దయ్యాయి. దీనికి తోడు కార్యాలయంలో ఫాగింగ్ మిషన్లు, బీరువాలు, బీరువాలో ఉన్నటువంటి రికార్డులు సైతం తడిసి ముద్దయ్యాయి. కోదాడ పట్టణంలోని పలు కాలనీల్లో నీళ్లు నిలిచిపోయాయి.

Advertisement

Next Story

Most Viewed