పార్లమెంట్‌లో వారిపై మాట్లాడినందకు రాహుల్‌పై వేటు.. కేంద్రంపై ఉత్తమ్ ఫైర్

by Vinod kumar |
పార్లమెంట్‌లో వారిపై మాట్లాడినందకు రాహుల్‌పై వేటు.. కేంద్రంపై ఉత్తమ్ ఫైర్
X

దిశ, నేరేడుచర్ల: నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధాని అయిన తర్వాత అదాని, అంబానీ ఆస్తులు వేయి రెట్లు పెరిగాయని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హుజూర్‌నగర్ పట్టణంలోని 3,11 వార్డులలో ఎంపీ నిధుల ద్వారా మంజూరైన సీసీ రోడ్డు పనులను ఎస్సీ కమ్యూనిటీ హల్ పనులను శంకు స్థాపన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అవినీతికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. మోడీ ప్రధాని అయ్యాక అదాని, అంబానీ ఆదాయం వెయ్యిరెట్లు పెరిగిందని వ్యాఖ్యానించారు.

గౌతమ్ అదానీ 14 ఓడరేవులు,8 ఎయిర్ పోట్లను వేయిల కోట్ల ఫవర్ కాంట్రాక్ట్ ధారాదత్తం చేశారని అన్నారు . వీటన్నింటిపై రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రస్తావిస్తున్నాడని ఉద్దేశంతోనే కక్షపూరిత సాధింపుగా ఆయనను పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి 24 గంటల్లోపే ఆయన పార్లమెంటు నివాసాన్ని ఖాళీ చేయించారని అన్నారు.


ఎప్పుడో ఐదు పది సంవత్సరాల క్రితం సూరత్‌లో మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టి రెండు నెలలు జైల్లో వేశారని అన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించిన నిరుద్యోగులకు నిరాశ ఎదురవుతున్నాయని అన్నారు. పేపర్ లీకేజ్‌లు చేస్తూ.. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని అన్నారు.

పేపర్లో అమ్ముకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని తప్పనిసరిగా ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరనే పడ్డాయని అన్నారు. ధాన్యం కొలుగోలు కేటాయింపులో ఎమ్మెల్యేకు సంబంధమేమిటని ఆయన ప్రశ్నించారు.

కోదాడ హుజూర్‌నగర్ నియోజకవర్గాల అభివృద్ధి కోసం 5.77 కోట్లు నిధులను మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జునరావు, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు నాగన్న గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గల్లా వెంకటేశ్వర్లు, సాముల శివారెడ్డి, దొంగర వెంకటేశ్వర్లు, ఎండి నిజాముద్దీన్, బాచిమంచి గిరిబాబు, భూక్యా మంజు నాయక్, కౌన్సిలర్లు తేజ వత్తు రాజా నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed