- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్-3’.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే?

దిశ, సినిమా: ‘ది ఫ్యామిలీ మ్యాన్’ (The Family Man)వెబ్ సిరీస్ ప్రేక్షకుల్లో ఎంతలా ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే రెండు సక్సెస్‌ఫుల్‌గా రెండు సీజన్లు పూర్తి కాగా అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అయితే మొదటి భాగంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ తెచ్చుకోవడంతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొంది.అయితే ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ముచ్చటగా మూడోసారి అలరించేందుకు సిద్దమైంది. రాజ్ అండ్ డికే (Raj Nidimoru and Krishna D.K)దర్శకత్వంలో రాబోతున్న ఈ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పాయ్(Manoj Bajpai) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే జైదీప్ అహ్లావత్ (Jaideep Ahlawat)కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. ఈ సిరీస్‌కు సంబంధించిన అప్డేట్స్ విడుదలై మంచి రెస్సాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పాతాళ్‌లోక్-2లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న జైదీప్ కూడా ‘ది ఫ్యామిలీ మ్యాన్-3’లో నటిస్తున్నారు. రెండేళ్ల క్రితమే ఆయన షూటింగ్‌లో భాగం అయ్యారు. ఆయన ఇందులో నటిస్తున్నట్లు తెలిసినప్పటికీ ఇందులో జాయిన్ అయినట్లు ఎవరికీ తెలియదు. జైదీప్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడే అసలు విషయాలు వెల్లడించలేను. ‘ ది ఫ్యామిలీ మ్యాన్-3’ మాత్రం నవంబర్ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అందుబాటులోకి వస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మనోజ్ బాజ్‌పాయ్ కామెంట్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
Read More..
OTT MOVIES: మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే..