- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మళ్లీ అదే ట్రెండ్ ఫాలో అవుతున్న రామ్ చరణ్.. ఈ సారి కూడా బొమ్మ బ్లాక్ బస్టరే అంటున్న ఫ్యాన్స్

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘పెద్ది’(Peddi). ఈ చిత్రానికి ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. ఏ ఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్న ఈ మూవీలో స్టార్ యాక్టర్ జగపతిబాబు(Jagapathi babu), శివన్న(Shivanna) కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక రీసెంట్‌గా ఈ సినిమా నుంచి రామ్ చరణ్ ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఆ పోస్టర్‌లో రామ్ చరణ్ తన స్టైలిష్, ఇంటెన్స్ అవతార్‌లో కనిపించాడు, ఇది అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈ క్రమంలో ఈ మూవీకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పెద్ది మూవీ పూర్తిగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా చరణ్ కూడా ఈ సినిమాలో మొత్తం ఉత్తరాంధ్ర స్లాంగ్‌లో మాట్లాడుతాడంట. అంతేకాక సినిమా కూడా మొత్తం అక్కడి భాషతోనే తీస్తున్నట్టు సమాచారం.
అయితే గతంలో సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో వచ్చిన ‘రంగస్థలం’(Rangasthalam) సినిమా కూడా ఉత్తరాంధ్ర స్లాంగ్‌లోనే తీయగా.. ఎంతగా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. దీంతో బుచ్చిబాబు కూడా అదే ఫాలో అవుతున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఈ దెబ్బతో బొమ్మబ్లాక్ బస్టర్‌తో పాటు బాక్సాఫీస్‌లు షేక్ కావాల్సిందే అని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ ఉగాది రోజున వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read More..