- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీఎం చంద్రబాబును కలవనున్న కేంద్ర వైద్య బృందం.. కారణం ఏంటంటే?

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో బర్డ్ ఫ్లూ లక్షణాలతో చిన్నారి మృతి చెందిన ఘటనపై కేంద్రం నుంచి వచ్చిన వైద్య బృందం విచారణ చేపట్టింది. ఈరోజు(శుక్రవారం) ఉదయం నరసరావుపేటకు కేంద్ర బృందం చేరుకుంది. గత నెల 16వ తేదీన నరసరావుపేట లో బర్డ్ ఫ్లూ లక్షణాలతో చిన్నారి మృతి చెందింది. తొలుత ఆమెకు మంగళగిరి ఎయిమ్స్‌లో చికిత్స అందించారు. చిన్నారి మృతి చెందిన తర్వాత శాంపిల్స్‌ను పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. నాలుగు రోజుల కిందట ఆ చిన్నారికి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. గురువారం ఇదే విషయమై సీఎం చంద్రబాబు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.
విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు బోధన ఆస్పత్రిలో ప్రత్యేకంగా 10 పడకల చొప్పున ఐసోలేషన్ వాటిని సిద్ధం చేసినట్లు వైద్య అధికారులు తెలిపారు. బర్డ్ ఫ్లూ మృతితో అప్రమత్తమైన కేంద్రం ఐ సి ఎం ఆర్ బృందాన్ని ఏపీకి పంపించింది. ఆ బృందం నిన్న మంగళగిరిలోని ఎయిమ్స్ లో వివరాలు సేకరించింది. బృందం లోని నలుగురు సభ్యులు సభ్యులు ఈరోజు నరసరావుపేట పర్యటనకు వచ్చారు. క్షేత్రస్థాయిలో వారు పరిశీలిస్తున్నారు సాయంత్రం సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిసి ఇక్కడి పరిస్థితులు వివరించనున్నారు. అయితే మంగళగిరిలో చిన్నారికి చికిత్స అందించిన వైద్యులకు, సిబ్బందికి కూడా హెచ్5 ఎన్ 1 పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం మంగళగిరి ఎయిమ్స్ వైద్యాధికారులకు సూచించింది.