ఇదెక్కడి మాస్ మామా.. కోడి గుడ్లను పొదిగిన వ్యక్తి.. రిజల్ట్ అదిరిపోలా...(వీడియో)

by Sujitha Rachapalli |
ఇదెక్కడి మాస్ మామా.. కోడి గుడ్లను పొదిగిన వ్యక్తి.. రిజల్ట్ అదిరిపోలా...(వీడియో)
X

దిశ, ఫీచర్స్ : కోడి గుడ్లను కోడి పొదిగితే పిల్లలు బయటకొస్తాయి. అదే మనిషి పొదిగితే ఏమవుతుంది..? అనే ఆలోచనతోనే ఫ్రెంచ్ ఆర్టిస్ట్ అబ్రహం పోయిన్‌చెవాల్ వినూత్న ప్రయత్నం చేశాడు. తన శరీర వేడిని ఉపయోగించి.. పారిస్‌లోని పలైస్ డి టోక్యో మ్యూజియంలో ఈ యూనిక్ థింగ్ ట్రై చేశాడు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన కుర్చీ కింద పెట్టిన పది గుడ్లపై కూర్చున్నాడు.

పొదిగే ఉష్ణోగ్రతను మేనేజ్ చేయడానికి.. కొరియన్ కళాకారుడు సీల్గి లీ రూపొందించిన ఇన్సులేటింగ్ దుప్పటిలో పోయిన్‌చెవాల్ తనను తాను చుట్టుకుని కూర్చుకున్నాడు. అల్లం వంటి వేడిని పెంచే ఆహారాన్ని తీసుకున్నాడు. ప్రతిరోజు భోజనానికి కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే విరామం తీసుకోగా.. సుమారు మూడు వారాల తర్వాత మొదటి కోడిపిల్ల గుడ్డు నుంచి బయటకు వచ్చింది. మిగిలిన తొమ్మిది ఎగ్స్ కూడా ఆ తర్వాత కొద్దిసేపటికే పిల్లలుగా మారాయి. ఇలా పుట్టిన పిల్లలను ఓ పొలానికి తరలించి పెంచడం విశేషం. కాగా ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ కాగా ఇందతా ఎలా సాధ్యమైందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఈ ఫీట్ ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి రావడం విశేషం.



Next Story

Most Viewed