Nara Lokesh: అర్థం అయిందా రాజా..! రెడ్‌బుక్‌పై మంత్రి లోకేశ్ హాట్ సెటైర్లు

by Shiva |   ( Updated:2025-03-29 06:58:32.0  )
Nara Lokesh: అర్థం అయిందా రాజా..! రెడ్‌బుక్‌పై మంత్రి లోకేశ్ హాట్ సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ (YCP) నాయకులు రెడ్‌బుక్ (Red Book) పేరు వింటేనే జంకుతున్నారు. ఐదేళ్ల పాలనలో వారు పాల్పడిన అక్రమాలు, భూకబ్జాలు, అవినీతిపై కూటమి సర్కార్ సమర శంఖం పూరించింది. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు (Former Ministers), ఎమ్మెల్యే (MLA's)లు, ఎంపీ (MP's)లపై విజిలెన్స్, శాఖపరమైన విచారణకు ఆదేశించింది. దీంతో రెడ్‌బుక్ (Red Book) పేరు వింటేనే వైసీపీ (YCP) నేతలకు కంటిమీద కునుకు లేకుండాపోతోంది. ఈ క్రమంలోనే రెడ్‌బుక్‌ (Red Book)పై మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) పొలిటికల్ సైటైర్లు (Political Satires) సంధించారు.

ఇవాళ మంగళగిరి (Mangalagiri) వేదికగా జరిగిన తెలుగుదేశం పార్టీ (Telugudesham Party) 43వ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. రెడ్‌బుక్ (Redbook) పేరు వింటనే కొందరికి గుండెపోటు వస్తుందంటూ.. ఇండైరెక్ట్‌గా కొడాలి నాని (Kodali Nani)ని ఉద్దేశించి సెటైర్లు వేశారు. కొంత‌మంది బాత్‌రూమ్‌‌లో పడి చెయ్యి విరగ్గొట్టుకుంటున్నారంటూ పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి (Peddireddy Ramchandra Reddy)పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అర్థమైందా రాజా..! అధికారాన్ని చూసి ఎన్నడూ గర్వపడొద్దంటూ మంత్రి నారా లోకేశ్ ప్రతిపక్ష వైసీపీ నేతలకు హితవు పలికారు.

Next Story

Most Viewed