- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Viral: అడుక్కోవాలనుకునే వారికి యాప్.. కమిషన్ మార్చిపోకూడదు మరీ!

దిశ, వెబ్ డెస్క్: ఒక్కపుడు ఏవైనా వస్తువులు కావాలంటే మార్కెట్ వెళ్లి కొనుకునే వాళ్లం. కానీ ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అరచేతిలో ప్రపంచం ఉన్నట్లే. ఏం కావాలన్న ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే క్షణాల్లో వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు ఈ ఖాతాలో బెగ్గింగ్ కూడా చేరింది. ఇందుకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గతంలో QR కోడ్‌లతో డిజిటల్ బెగ్గింగ్ చేస్తున్న వీడియోలు వైరల్ అవ్వటం చూశాం. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ పేజీ 'westafrikanman' ఈ డిజిటల్ బెగ్గింగ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర పోస్టును షేర్ చేసింది. త్వరలో 'బెగ్ర్ (Begr)' అనే కొత్త యాప్‌ను లాంచ్ చేయబోతున్నట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా ప్రజలు ధనవంతులను డబ్బులు అడుకోవచ్చని, గరిష్టంగా 10 బిలియన్ వరకు అడుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అయితే, నెలకు రెండు సార్లు మాత్రమే బెగ్గింగ్‌కు వీలుంటుందని చెప్పారు. అలాగే, ఈ యాప్ సీఈఓకు అడుకున్న దాంట్లో 20 శాతం కమిషన్ ఇవ్వాలని పేర్కొన్నారు.
ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అంతేకాదు, టెక్నాలజీ ద్వారా బెగ్గింగ్‌ను కూడా వ్యాపారంగా మార్చే ఈ ఆలోచనపై నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. 'అడుక్కునేందుకు ఇప్పుడు వీధుల్లో చేతులు చాచాల్సిన అవసరం లేదు, ఒక యాప్ డౌన్‌లోడ్ చేస్తే సరిపోతుంది' అని కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తుండగా, టెక్నాలజీ అందరి చేతుల్లోకి వచ్చిన తీరును ఇది చూపిస్తోందని మరికొందరు అంటున్నారు.