- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేబినెట్ విస్తరణ.. రంగారెడ్డి ఎమ్మెల్యేలకు చాన్స్ ఇవ్వండి.. హైకమాండ్‌కు జానారెడ్డి లేఖ

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ కేబినెట్ విస్తరణ (cabinet expansion) కు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆశాహుల జాబితాను హైకమాండ్‌కు పంపించినట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తమ ప్రాంతం వారికి కూడా ప్రాతినిధ్యం కల్పించాలని అధిష్టానానికి కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డి (Kunduru Jana Reddy) రిక్వెస్ట్ చేశారు. కేబినెట్ విస్తరణలో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంగళవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ (K C Venugopal)కు లేఖ రాశారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్యేలకి మంత్రివర్గంలో చోటు కల్పించాలని లేఖలో కోరారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు ప్రయోజనమే కాకుండా, కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహద పడుతుందని పేర్కొన్నారు.
కాగా, ఇప్పటికే తమ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని మాదిగ, లంబాడి, బీసీ సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఇటీవల అధిష్టానానికి లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్, పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌లకు తమ వినతులను మెయిల్, ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఇక ఏప్రిల్ 3న మంత్రి వర్గ విస్తరణ ఉండే చాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. ఇందులో నాలుగింటిని భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.