కాంగ్రెస్ పాలనలోనే ప్రజలకు సంక్షేమాలు : నిర్మల జగ్గారెడ్డి

by Kalyani |
కాంగ్రెస్ పాలనలోనే ప్రజలకు సంక్షేమాలు : నిర్మల జగ్గారెడ్డి
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం కంది మండల కేంద్రంలో ఆమె సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారమే ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు చేయలేని సంక్షేమ ఫలాలు కాంగ్రెస్ సర్కార్ చేసి చూపిస్తుందని చెప్పారు. అలాగే ఆరు గ్యారెంటీ ల అమలు కూడా అన్నిచోట్ల జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కంది మండల తహసీల్దార్ విజయలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేర్యాల ఆంజనేయులు, మోతిలాల్, చిన్న సాయి శ్రీరామ్, రఘు గౌడ్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story