- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రతి పేదవారి ఇంటికి సన్నబియ్యం : ఎమ్మెల్యే

దిశ, వర్థన్నపేట: ప్రతి పేదవారి ఇంటికి సన్నబియ్యం చేరాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు అన్నారు. మంగళవారం వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నం బియ్యం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే , స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు, వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీమతి సంధ్యా రాణీ తో కలిసి ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి పేదవారి ఇంటికి సన్నబియ్యం అందాలని, పేదవారికి పట్టెడన్నం పెట్టాలన్న గొప్ప ఆలోచనతో సన్న బియ్యం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని అన్నారు. రాష్ట్రంలోని 3 కోట్ల 10 లక్షల మందికి ఆరు కిలోల సన్నబియ్యం అందజేస్తూ అందుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుంది అన్నారు.
వర్ధన్నపేట నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 2,70,148 మంది ప్రజలకు ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఏ ప్రభుత్వాలున్నా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేయలేరని, ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకం అన్నారు. పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు.పేదలు దొడ్డు బియ్యం తినలేరు, పీడీఎస్ బియ్యాన్ని మిల్లర్లు, దళారులు సైక్లింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి పేదవారి ఇంట ప్రతిరోజూ పండుగ జరగాలన్న ఆలోచనతో, పేద వారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించామని తెలిపారు.
ఈ గడ్డ మీద నుంచి ప్రారంభించిన పథకాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా పకడ్బందీగా అమలు చేసి పేదవారికి అండగా ఉంటామని అన్నారు. దేశంలోనే అత్యధికంగా వడ్లను పండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిందని, ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా దిగుబడి వచ్చే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. రైతుల శ్రమ ఎక్కడికీ పోదని, ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లో 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల మేరకు రుణమాఫీ చేశామన్నారు. మొదట్లోనే 7,625 కోట్ల మేరకు రైతు భరోసా చెల్లించాం, రైతు భరోసా 10 వేల నుంచి 12 వేలకు పెంచిన గొప్ప ప్రజా ప్రభుత్వం అన్నారు. రైతులు పండించిన ప్రతి చివరి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, సన్నవడ్లు పండిస్తే 500 బోనస్ ఇస్తామని, రైతులను ప్రోత్సాహకాలు అందిస్తున్న గొప్ప ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అన్నారు.
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పత్రి భాను ప్రసాద్, నాయకులు మహమ్మద్ చోటే, పోశాల వెంకన్న గౌడ్, అనిమిరెడ్డి కృష్ణారెడ్డి, ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.