- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Preity Zinta: ఐపీఎల్ వేళ చిక్కుల్లో పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రితి జింటా.. రాజకీయంగా దుమారం

దిశ, డైనమిక్ బ్యూరో: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు యజమాని ప్రీతి జింటాకు (Preity Zinta) న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ (India Cooperative Bank) రుణమాఫీ చేసిందన్న ఆరోపణల వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. ప్రీతి జింటా న్యూ ఇండియా బ్యాంక్ నుంచి 1.5 కోట్ల రుణఉపశనం పొందారని తాజాగా ఆర్థికనేరాల విభాగం ఈవోడబ్ల్యూ తన ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. ఈ అంశంలో గతంలో ప్రీతిజింటాపై తీవ్ర ఆరోపణలు చేసిన కేరళ కాంగ్రెస్ (Kerala Congress) తాజాగా మరోసారి ఎక్స్ వేదికగా ఆమెను టార్గెట్ చేసింది. 'డియర్ ప్రీతిజింటా మీరు మీ రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించానని చెప్పారు. కాని ఇప్పుడు మీకు రూ.1.55 కోట్ల ఉపశమనాలు లభించాయని ఆర్థిక నేరాల విభాగం చెబుతోంది. గతంలో మా ఆరోపణలపై మీరు చేసిన విమర్శలతో మొత్తం ఎకోసిస్టమ్ మాపైకి దూసుకువచ్చింది. కానీ ఇప్పుడు ఈవోడబ్ల్యూనే మీకు ఆర్థిక ప్రయోజనం జరిగిందని స్పష్టం చేస్తోంది. ఇలా చెప్పడానికి ఎకానమిక్ అఫెన్స్ వింగ్ కేరళ కాంగ్రెస్ కు చెందినది కాదు. ఇది భారత ప్రభుత్వానికి చెందినది. ప్రజలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని రుజువుచేసుకునేందుకు ఇకనైనా మీ బ్యాంక్ రుణాలకు సంబంధించిన స్టేట్మెట్స్ బయటపెడితే బాగుటుంది. అని ఎక్స్ లో పోస్టు చేసింది.
గతంలో కాంగ్రెస్ పై ప్రీతి సీరియస్:
న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ నుంచి ప్రీతి జింటా తీసుకున్న రూ. 18 కోట్ల రుణాన్ని బీజేపీ మాఫీ చేసిందని, అందుకు గాను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించారని కేరళ కాంగ్రెస్ గత ఫిబ్రవరిలో ఆరోపించింది. ఈ ఆరోపణలపై అప్పట్లో స్పందించిన ప్రీతిజింటా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. నా సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ సొంతంగానే నిర్వహించుకుంటాను. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు. 10 ఏళ్ల క్రితమే ఆ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని నేను తీర్చేశాను. నేను తీసుకున్న రుణాన్ని ఎవరు మాఫీ చేయలేదు. ఆ అవసరం నాకు లేదు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే ఈవోడబ్ల్యూ ప్రాథమిక విచారణలో ప్రీతిజింటాకు ఈ బ్యాంకు రుణాల్లో ఆర్థిక ప్రయోజనం దక్కిందని స్పష్టం చేయడంతో ఆమెపై కేరళ కాంగ్రెస్ ఎటాక్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన న్యూస్ పేపర్ క్లిప్ ను షేర్ చేసి ప్రీతిజింటాను నిలదీస్తోంది. గత ఫిబ్రవరిలో ఆ బ్యాంకును మూసేయడంతో డిపాజిట్లర్లు తమ సొంత డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.