Manforce condoms: ప్రపంచంలోనే మొదటి ఏఐ పవర్డ్ కండోమ్.. షాకైన నెటిజన్లు

by D.Reddy |
Manforce condoms: ప్రపంచంలోనే మొదటి ఏఐ పవర్డ్ కండోమ్.. షాకైన నెటిజన్లు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (Artificial Intelligence) అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. మనిషి రూపొందించిన ఈ టెక్నాలజీ మానవుని మేధస్సుకు మించి పనులు చేస్తోంది. దీంతో ఏఐ వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. అయితే, తాజాగా ఈ ఏఐ(AI)ని మ్యాన్‌కైండ్ ఫార్మా (Mankind Pharma) సంస్థకు చెందిన మ్యాన్‌ఫోర్స్‌ కండోమ్స్‌ (Manforce condoms) కూడా ఉపయోగించుకుంది. కస్టమర్లను ఆకర్షించుకునేందుకు ప్రపంచంలోనే మొదటి ఏఐ పవర్డ్ కండోమ్‌ను (AI-Powered condom) రూపొందించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా విడుదల చేసింది.

మ్యాన్‌ఫోర్స్ ఏఐ పవర్డ్ కండోమ్‌ను డాట్ AIగా తీసుకోస్తున్నట్లు తెలుపుతూ.. దాని ఆకర్షణీయమైన లక్షణాలను వివరించింది. శృంగారంలో పాల్గొనే జంటకు ఇది పూర్తిగా కొత్త ఆనందాన్ని అందిస్తుందని, ఇందులోని నానో సెన్సార్లు జంటల మధ్య సన్నిహిత క్షణాలను మరింత అద్భుతంగా మారుస్తుందని వెల్లడించింది. అంతేకాదు, QR స్కాన్ సహాయంతో యాప్ ద్వారా కండోమ్ పనితీరు ట్రాకింగ్‌ను కూడా చేసుకోవచ్చని తెలిపింది. ఇక ఈ ప్రకటనను సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వటంతో ఆసక్తికర చర్చకు దారితీసింది. అంతేకాదు, ఇప్పటి వరకు ౩౦౦Kకు పైగా నెటిజన్లు ఈ ప్రకటనను షేర్ చేశారు. అయితే, తర్వాత అసలు విషయం తెలిసి ఆశ్చర్యానికి గురయ్యారు.

మ్యాన్‌ఫోర్స్ సంస్థ ఏప్రిల్ ఫస్ట్ సందర్భంగా ఈ చిలిపి పనిగా చేసినట్లుగా ప్రకటించింది. బ్రాండ్ ప్రమోటింగ్ కోసం ఏప్రిల్ ఫూల్స్ డే ఫ్రాంక్‌గా దీన్ని రూపొందించినట్లు వెల్లడించింది. కాగా, మ్యాన్‌ఫోర్స్ కండోమ్స్ గతంలో కూడా ఈ విధంగా ఏప్రిల్ ఫూల్స్ ఫ్రాంక్ వీడియోలను రూపొందించింది.

Next Story

Most Viewed