- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కొత్త సబ్ స్టేషన్‌లతో మెరుగుపడుతున్న విద్యుత్ సరఫరా : జడ్చర్ల ఎమ్మెల్యే

దిశ,జడ్చర్ల : జడ్చర్ల నియోజకవర్గంలో కొత్తగా నాలుగు విద్యుత్ 33/11 kv సబ్ స్టేషన్లు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే జనం పల్లి అనిరుద్ రెడ్డి తెలిపారు. రూ.14.60 కోట్ల తో ఈ కొత్త సబ్ స్టేషన్ల ను నిర్మించనున్నారని వివరించారు. జడ్చర్ల నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8 కొత్త సబ్ స్టేషన్ల ను మంజూరు చేయడం జరిగిందని శనివారం మీడియా కు విడుదల చేసిన ప్రకటన లో గుర్తు చేశారు.ఇది కాకుండా ఇప్పుడు అదనంగా మరో 4 సబ్ స్టేషన్ల ను ఇప్పుడు మంజూరు చేశారని తెలిపారు. జడ్చర్ల మండలంలోని గొల్లపల్లి, ఆలూరు గ్రామాలతో పాటు జడ్చర్ల పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతానికి ఒక సబ్ స్టేషన్ మంజూరు అయిందన్నారు.
ఇది కాకుండా మిడిల్ మండలంలోని రాణి పేట కు మరో సబ్ స్టేషన్ మంజూరు కావడం జరిగిందని వివరించారు. ఈ సబ్ స్టేషన్లలో గొల్లపల్లి సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.3.53 కోట్లు, ఆలూరు సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.3.86 కోట్లు, జడ్చర్ల పట్టణం లో నిర్మించే సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.3.54 కోట్లు, రాణి పేట సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.3.67 కోట్లు చొప్పున మొత్తం రూ.14.60 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని అనిరుధ్ రెడ్డి వెల్లడించారు.ఈ కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం తో విద్యుత్ సరఫరా మరింత మెరుగు పడుతుందని చెప్పారు. గతంలో మంజూరు అయిన 8 సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నాలుగు విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలు కూడా సకాలంలో పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అనిరుధ్ రెడ్డి ఆదేశించారు.