- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
cold rooms: చల్లగా ఉండే గదిలో పడుకుంటున్నారా..? తర్వాత జరిగే పరిణామాలివే..!

దిశ, ఫీచర్స్ : అసలే వేసవి కాలం. ఓ వైపు ఎండలు మండుతున్నాయ్.. బయట తిరిగేవారైతే ఉక్కబోతలతో అవస్థలు పడుతున్నారు. ఇలాంటప్పుడు చల్లగా ఏసీగదిలో కూర్చుంటేనో, పడుకుంటేనో ఆ హాయే వేరబ్బా అనిపిస్తుంది ఎవరికైనా.. అయితే ఏసీ కొదరికి పడొచ్చు. మరి కొందరికి పడకపోవచ్చు. ఆయా వ్యక్తుల వ్యక్తిగత ప్రాధాన్యతలు, అలవాట్లను బట్టి కూడా ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే ఓ తాజా అధ్యయనం మరో ‘చల్లటి’ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఏంటంటే.. చల్లటి గదిలో పడుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని బెబుతోంది. అదెలాగో చూద్దామా!
*అధ్యయనంలో భాగంగా యూఎస్ఏలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) పరిశోధకులు చల్లని గది ఉష్ణోగ్రతల్లో (సుమారు 65°F or 18°C) కొంతమంది వలంటీర్లను నెలరోజులపాటు 19°C (66°F) నిద్రించాలని సూచించారు. అదే విధంగా సాధారణ ఉష్ణోగ్రత(24°C లేదా 75°F)లో కూడా నిద్రించాలని మరికొంత మంది వలంటీర్లకు సూచించారు. ఇలా 30 రోజుల తర్వాత ఈ రెండు గ్రూపుల్లోని వ్యక్తుల మానసిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలను ఎనలైజ్ చేశారు.
*అయితే చల్లని గదిలో నిద్రించిన వారిలో పరిశోధకులు కొన్ని సానుకూల మార్పులను, ఆరోగ్య ప్రయోజనాలను గుర్తించారు. ముఖ్యంగా అధిక బరువుతో, శరీరంలో అధిక కొవ్వుతో బాధపడుతున్నవారు చల్లటి గదిలో నిద్రపోవడం వల్ల వారి శరీరంలో బ్రౌన్ ఫ్యాట్ పెరిగిందని, ఇది కేలరీలను బర్న్ చేయడానికి దారితీసి, ఆరోగ్యానికి మేలు చేసే చేసిందని రీసెర్చర్స్ పేర్కొన్నారు. చల్లని వెదర్ సహజంగానే శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడటంవల్ల ఈ విధమైన మార్పులు జరుగుతాయని పరిశోధకులు అంటున్నారు.
*కోల్డ్ బెడ్ రూముల్లో నిద్రించడం అనేది కేవలం కేలరీలను బర్న్ చేయడమే కాదు, క్వాలిటీ స్లీప్‌ను ప్రేరేపిస్తుంది కాబట్టి ఇది మెరుగైన మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుందని రీసెర్చర్స్ అంటున్నారు. దీనివల్ల నిద్ర మేల్కొన్న తర్వాత సదరు వ్యక్తుల్లో బ్రెయిన్ యాక్టివిటీస్ పెరుగుతాయి. ఇది వారి రోజువారీ పనుల్లో ప్రొడక్టివిటీని పెంచుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా చల్లటి గది ఉష్ణోగ్రతలు మంచి నిద్రను, ఆరోగ్యకరమైన జీవక్రియలను ప్రేరేపించడం ద్వారా దీర్ఘాయువును కూడా పెంచుతాయంటున్నారు పరిశోధకులు.