డిండి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేలు…

by Kalyani |
డిండి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేలు…
X

దిశ, డిండి: డిండి మండల పరిధిలో ఉన్న డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి ఆయకట్ట రైతాంగానికి శుక్రవారం దేవరకొండ, అచ్చంపేట ఎమ్మెల్యేలు నేనావత్ బాలునాయక్, చిక్కుడు వంశీకృష్ణ, ప్రాజెక్టు అధికారి ఈ ఈ శ్రీధర్ రావు కలిసి గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేయడం జరిగింది. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శాసనమని ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు 15వ తేదీ లోపు చేయబోతున్నామని, వ్యవసాయాన్ని పండుగ చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ విధానమన్నారు. రైతు భరోసా ద్వారా రైతులకు సంవత్సరానికి రెండు దఫాలుగా ఎకరాకు 7500 అందిస్తామని, రైతులను రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. గత ప్రభుత్వం 26 వేల కోట్ల రూపాయలను రైతుబంధు ద్వారా దుర్వినియోగం చేశారని అన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు మాధవరం దేవేందర్ రావు, మాధవరం సునీత, నల్లవెల్లి రాజేష్ రెడ్డి, దొంతినేని వెంకటేశ్వరరావు, దొంతినేని యాదగిరిరావు, రుక్మారెడ్డి,మల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, తిప్పర్తి విజయేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, బుషి పాక వెంకటయ్య, ఆమనగంటి రాధిక, నూకం వెంకటేష్, పొలం లక్ష్మణ్,వావిళ్ళ సలయ్య, మేకల కాశన్న, పున్న దినేష్, షేక్ ఉమర్, అవుట మల్లేష్, లక్ పతి, బద్దెల శ్రీనివాస్ యాదవ్, కిన్నెర హరికృష్ణ, కొర్ర రాంసింగ్, భీముడు, బాదమోని శ్రీనివాస్ గౌడ్, జంగా గిరి, వెంకట్ రెడ్డి, జరుపుల లక్ష్మి, గడ్డమీది సాయి, వేణు, రేఖ్య నాయక్, కృష్ణ, రవి, తేజు, పోషాలు, గణేష్, అజయ్, కార్యకర్తలు, నీటి పారుదల శాఖ అధికారులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed