- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మూడోసారి కూడా నేను ఎమ్మెల్యేనవుతా...
దిశ, నకరేకల్: నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నా... మీరంతా ఆశీర్వదిస్తే మూడోసారీ ఎమ్మెల్యేనై రాష్ట్రంలోనే నకిరేకల్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా మారుస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి దేశ ప్రజలంతా కేసీఆర్ పాలన కోరుతున్నారని తెలిపారు. నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామంలో 25 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసే సీసీ రోడ్డు, 20 లక్షల రూపాయలతో నిర్మించే కమ్యూనిటీ హాల్ కు బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం అంగన్వాడీ సెంటర్లో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి, బీపీ, షుగర్ పేషెంట్లకు మెడికల్ కిట్లను పంపిణీ చేశారు.
అనంతరం మాట్లాడుతూ ఎంతో నిబద్ధతతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని ధైర్యంగా ఓట్లు అడుగుతామని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని గుర్తుచేశారు. పక్క రాష్ట్రాలకు తెలంగాణ రోల్ మోడల్ గా మారిందని అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని వారికి భంగపాటు తప్పదని అన్నారు. గతంలో ఏ నాయకులు చేయని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని వెల్లడించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ రూపు రేఖలు మారుస్తానని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ధనలక్ష్మి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.