నూతన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

by Kalyani |
నూతన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి
X

దిశ, భువనగిరి రూరల్: తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం మూడు డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం రాష్ట్రంలో 102 డయాలసిస్ కేంద్రాలు నడుస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో నూతన డయాలసిస్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుసుకొని వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారని కొనియాడారు.

రాష్ట్రంలో వైద్య రంగాన్ని పెద్ద ఎత్తున విస్తరిస్తున్నామని చెప్పారు. డయాలసిస్ రోగుల భాధ వర్ణనాతీతమని, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఇబ్బంది పడకుండా ఇక్కడే డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ అవకాశాన్ని డయాలసిస్ రోగులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, జిల్లా వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story