- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రమాదాల కొలువుగా అసంపూర్తి హైవే.. అడ్డుకుంటున్న వ్యాపారస్తులు
దిశ, నిడమనూరు: మండల కేంద్రంలో హైవే రోడ్డు పనులు అసంపూర్తిగా ఆగిపోవడంతో తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు యాక్సిడెంట్‌కు గురై చనిపోగా, తరచుగా అక్కడక్కడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ హైవే రోడ్డు కోదాడ నుంచి జడ్చర్ల వరకు నిడమనూరు మండల కేంద్రం గుండా ఈ రోడ్డు వెళ్తుంది, దాదాపుగా రోడ్డు పనులు పూర్తి కావలసి ఉండగా, నిడమనూరులో కొందరు బడా వ్యాపారులు కోర్టుకు వెళ్లి ఈ రోడ్డు పనులను అడ్డుకుంటున్నారు. దీంతో వాహనాల రద్దీ పెరిగి యాక్సిడెంట్ అవుతున్నాయి, దీనికితోడు చిరు వ్యాపారస్తులు రోడ్డుమీదికి వచ్చి వ్యాపారాలు చేయడంతో వాహనదారులకు, కాలిబాటన వెళ్లే ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు.
ఈ రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాల కారణంగా నిడమనూరు ప్రజలు రోడ్డు మీదికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఊరికి చివరి రెండు వైపుల రోడ్డు పనులు పూర్తి కావడంతో వచ్చే వాహనాలు వేగంగా వస్తున్నాయి. తీరా ఊరిలో అసంపూర్తి రోడ్డు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికి ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని రోడ్డు పనులను పూర్తిచేయాలని, పలువురు పేర్కొంటున్నారు. అయితే అసంపూర్తిగా నిలిచిన రోడ్డు పనుల గురించి కాంట్రాక్టర్ నాయుడిని ప్రవ్నించగా.. తమ పనులను కొందరు వ్యాపారస్తులు ఆపుతున్నారని వివరణ ఇచ్చారు.