- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొండమల్లేపల్లి కేజీబీవీ ఎస్ఓను సస్పెండ్ చేయాలి !
దిశ, దేవరకొండ : కొండమల్లేపల్లిలోని కేజీబీవీ పాఠశాలలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని ఆగంతకుడు పాఠశాలలో విద్యార్థినిలు నిద్రిస్తున్న గదిలో చొరబడి భయభ్రాంతులకు గురిచేసిన విషయం తెలిసిందే. జరిగిన విషయాన్ని పాఠశాల వాచ్మెన్ ఎస్ఓ దృష్టికి తీసుకుపోయిన స్పందించలేదని, ఐక్య విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన విషయం బయటికి పొక్కడంతో బుధవారం మధ్యాహ్నం పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు హడావిడిగా పాఠశాలకు చేరుకుని సిబ్బందిని ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడం, సరైన భద్రత లేకపోవడంతో తమ పిల్లల్ని ఇళ్లకు తీసుకుపోయారని సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.
గతంలో కూడా ఫుడ్ పాయిజన్ జరిగి పదిమంది విద్యార్థులు అనారోగ్యం పాలైనా పై అధికారులకు విషయం బయటికి పొక్కకుండా సమస్యను దాచి విద్యార్థులకు ఇబ్బంది కలిగించేలా చేసిందని వారు ఆరోపించారు. పాఠశాల నిర్వహణకు ఇచ్చిన బడ్జెట్ ను అవసరాలకు వాడకుండా ఎలాంటి భద్రతాపరమైన చర్యలు, సరైన ఆహారం వసతులు పిల్లలకు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఓను సస్పెండ్ చేయాలని, శనివారం డీఈవోకి దేవరకొండ ఐక్య విద్యార్థి సంఘం నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎండీ ఖదీర్, రామావత్ సేవ నాయక్, రామావత్ లక్ష్మణ్, కొర్ర నాగరాజు నాయక్, మురళీకృష్ణ, కొత్త అఖిల్, కోటేష్, పసుపులేటి శివ, అశోక్, శ్రీకాంత్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.