Kushboo: విశాల్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన నటి.. ఎట్టకేలకు అసలు ప్రాబ్లం చెప్పేసిందిగా

by Kavitha |
Kushboo: విశాల్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన నటి.. ఎట్టకేలకు అసలు ప్రాబ్లం చెప్పేసిందిగా
X

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో విశాల్ రీసెంట్‌గా తాను నటించిన ‘మదగజరాజు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చినప్పుడు అక్కడ అతన్ని చూసి అక్కడ ఉన్నవారందరూ ఒక్కసారిగా షాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో ఆయన మొఖం అంతా వాచిపోయి, మాట్లాడుతున్న టైంలో చేతులు వణికిపోతూ, నోట్లోంచి మాట కూడా సరిగా రాలేని స్థితిలో ఉన్నాడు. ఇక అతన్ని అలా చూసిన అతని ఫ్యాన్స్‌ విశాల్‌కు ఏమైందని ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో తాజాగా విశాల్ హెల్త్ గురించి నటి కుష్బూ క్లారిటీ ఇచ్చింది.

ఆమె మాట్లాడుతూ.. ‘11 ఏళ్ల తర్వాత తాను నటించిన ‘మదగజరాజు’ మూవీ రిలీజ్ అవుతుందనే సంతోషంలో డెంగ్యూతో బాధపడుతున్నప్పటికీ విశాల్ ఈవెంట్‌కి వచ్చారు. 103 డిగ్రీల టెంపరేచర్ కారణంగా ఈ ఈవెంట్‌లో వణికారు. ఇక ఈవెంట్ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే వ్యూస్ కోసం విశాల్ ఆరోగ్యంపై కొందరు తప్పుడు వార్తలు రాస్తున్నారు’ అంటూ నటి అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. విశాల్ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed