Harish Rao : ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణి: హరీష్ రావు

by Y. Venkata Narasimha Reddy |
Harish Rao : ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణి: హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : ఎల్ఆర్ఎస్ (LRS)పై కాంగ్రెస్(Congress) రెండు నాల్కల ధోరణి(Double-Tongued)తో వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ మాజా మంత్రి టి.హరీష్ రావు(Harish Rao)ఎక్స్ వేదికగా విమర్శించారు. మేము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్(ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్)ను ఉచితంగా అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ కోసం రెండు రోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రజల నుంచి సొమ్మును దండుకునే కార్యక్రమానికి తెర లేపడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ పేరిట 15 వేల కోట్లు ప్రజల ముక్కు పిండి వసూలు చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

నాడు ఎల్ఆర్ఎస్ పైన అడ్డగోలుగా విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి రాగానే అసలు రంగు బయటపెట్టుకుందని హరీష్ రావు విమర్శించారు. డబ్బులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎల్ఆర్ఎస్ పేరిట డబ్బులు దండుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రియల్ ఎస్టేట్ త్వరలో పుంజుకుంటుందని స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటించడం అంటే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందనే కదా అర్థమని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ అస్తవ్యస్త పాలనతోనే రియల్ ఎస్టేట్ కుదేలైందని మేము ముందు నుండే చెప్తుంటే బుకాయిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దాడులు చేయడం మానేసి అభివృద్ధిపై దృష్టి సారించండని.. దారి తప్పిన పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేయండని హితవు పలికారు.

Advertisement

Next Story

Most Viewed