'SHARWA-37'.. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ రివీల్‌కి డేట్ ఫిక్స్.. ఏకంగా ఆ స్టార్స్‌తో లాంచ్(పోస్ట్)

by Kavitha |   ( Updated:2025-01-08 13:24:37.0  )
SHARWA-37.. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ రివీల్‌కి డేట్ ఫిక్స్.. ఏకంగా ఆ స్టార్స్‌తో లాంచ్(పోస్ట్)
X

దిశ, సినిమా: చార్మింగ్ స్టార్ శర్వానంద్, ‘సామజవరగమన’ ఫేమ్ డైరెక్టర్ రామ్ అబ్బరాజు కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘శర్వా-37’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఎమోషనల్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్‌ను ఇచ్చారు మేకర్స్. సంక్రాతికి కానుకగా(జనవరి14న) ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను నందమూరి అండ్ కొనిదెల ఫ్యామిలీ వాళ్లతో లాంచ్ చేపించబోతున్నట్లుగా తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఆ ఫ్యామిలీలో ఎవరితో చేయిస్తారనేది మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీనికోసం అటు మెగా, నందమూరి, శర్వానంద్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed