- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజాస్వామ్యంలో ఇది ఒక చీకటి రోజు: రమావత్ స్వామి నాయక్
దిశ, నాగార్జునసాగర్: ప్రజా సమస్యలపై శాంతియుతంగా వైయస్ షర్మిల చేస్తోన్న ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రభుత్వం కావాలనే అడ్డుకుంటుందని వైయస్సార్‌టీపీ నాగార్జునసాగర్ ఇంచార్జ్ రమావత్ స్వామి నాయక్ అన్నారు. రాష్ట్రంలో షర్మిలకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాప్రస్థానం పేరుతో ఇప్పటికే 3500 కిలోమీటర్లు పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న తరుణంలో.. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్న షర్మిల మీద ఇలాంటి దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. పాదయాత్రకు ప్రజల్లో విశేష స్పందన వస్తుందన్న భయంతోనే టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకొని.. ఫ్లెక్సీలు, బస్సు అద్దాలు పగలగొట్టడం, తగలబెట్టడం వంటి పనికిమాలిన పనులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజన్న రాజ్యం స్థాపించడానికి షర్మిలమ్మ అడుగులు వేస్తుంటే.. ఈ ప్రభుత్వం ఓర్వలేక పోతుందని రమావత్ స్వామి నాయక్ ఆరోపించారు.