- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నియంతపాలనను పారద్రోలడం కాంగ్రెస్‌తోనే సాధ్యం
దిశ, చౌటుప్పల్: రాష్ట్రంలో నియంత పాలనను పారద్రోలాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం చౌటుప్పల్ మండలం తుప్రాన్ పేట్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ...ఉపఎన్నికలలో భారతదేశ చరిత్రలో మునుగోడు ప్రజలు కనివిని ఎరుగని యుద్ధం చేశారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం నేను రాజీనామా చేశాను అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనను గద్దె తించడానికి బీజేపీ పార్టీలో చేరానని కానీ బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని తెలిశాక దాంట్లో ఉండలేకపోయనని అందుకే మన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాలివీస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన బ్రతుకులు బాగుపడతాయి. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని నీతివంతమైన పాలన అందిస్తుందని కావున మునుగోడు ప్రజలంతా హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.