చెరువుకు గండి పడటం బాధాకరం

by Sridhar Babu |
చెరువుకు గండి పడటం బాధాకరం
X

దిశ, చిలుకూరు : మండలంలోని పాలెఅన్నారం(నారాయణపురం) ఊర చెరువు కట్ట నాలుగు చోట్ల గండి పడడం బాధాకరమని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. ధ్వంసమైన చెరువును ఆమె మంగళవారం పరిశీలించారు. అధికారులు, స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వరదతో నష్టపోయిన బాధితులకు ఇళ్లు నిర్మించేలా చూస్తామన్నారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామన్నారు. వరద ప్రభావంతో ఆహార పదార్థాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు వారం రోజుల పాటు భోజన సదుపాయం కల్పించాలని ఆర్డీవోకు సూచించారు.

మరమ్మతులకు గురైన ఇళ్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు చెరువుకు పూర్తిస్థాయి సర్వే నిర్వహించి ఆక్రమణలు తొలగించకుండా మరమ్మతులు చేపట్టొద్దని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కొందరు చెరువు శిఖాన్ని ఆక్రమించడంతో ఈ దుస్థితి దాపురించిందని, చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ పర్యటనలో మాజీ ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, కాంగ్రెస్ నాయకులు కీత వెంకటేశ్వర్లు, యడవెల్లి పుల్లారావు, పిండ్రాతి హనుమంతరావు, మండవ చిన్న మధు, కొండా సైదయ్య, కొండా ప్రభాకర్, బండ్ల కోటయ్య, సీపీఐ మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, చిలుకూరు తహసీల్దార్ ధృవ్ కుమార్, ఎంపీడీఓ కందాళ గిరిబాబు, నీటిపారుదల, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed