Delhi polls: ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు దీదీ.. ఆప్ కే టీఎంసీ మద్దతు

by Shamantha N |   ( Updated:2025-01-08 15:09:21.0  )
Delhi polls: ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు దీదీ.. ఆప్ కే టీఎంసీ మద్దతు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు దీదీ షాక్ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి తృణమూల్ కాంగ్రెస్(TMC) మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఆప్ కి కు మద్దతు తెలిపిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్ట్‌ చేశారు. "ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ కి టీఎంసీ మద్దతు ప్రకటించింది. మమతా దీదీకి నేను వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా మంచి, చెడు సమయాల్లో మీరు ఎల్లప్పుడూ మాకు మద్దతు ఇచ్చారు” అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.

ఎస్పీ మద్దతు

ఇకపోతే, ఇప్పటికే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇస్తారు సమాజ్‌వాదీ పార్టీ కూడా ఆప్‌కి మద్దతు ప్రకటించింది. పార్టీకి మద్దతిచ్చినందుకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా, 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆప్ ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడించింది. ఇక, ఢిల్లీలో అధికార ఆప్ 2015, 2020 ఎన్నికల్లో వరుసగా 67, 62 స్థానాలతో గెలిచింది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా.. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Read More ...

Gadkari : రోడ్డు ప్రమాదాలపై కేంద్రం కొత్త పథకం : గడ్కరీ


Advertisement

Next Story

Most Viewed