ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

by Sridhar Babu |
ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
X

దిశ, ఆదిలాబాద్ : విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాల కోసం జిల్లాలోని విద్యార్థినీ, విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాల కోసం ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 23న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనుందని , గురుకులాల్లో విద్యనభ్యసించాలని అనుకునే వారు బాల, బాలికలు ఆన్లైన్ లో ఫిబ్రవరి 1వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు కుల ధ్రువీకరణ పత్రం నెంబరు, ఆదాయ ధ్రువీకరణ పత్రం నెంబరు, ఆధార్ కార్డు నెంబరు, బర్త్ సర్టిఫికెట్, ఫొటో అవసరమని తెలిపారు.

పై ధ్రువీకరణ పత్రాల సత్వర జారీ కోసం కలెక్టరేట్లో సహాయ కేంద్రం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6 నుండి 9 వ తరగతి వరకు ఖాళీ సీట్లలో ప్రవేశాల కోసం, గౌలిదొడ్డి లోని సాంఘిక సంక్షేమ గురుకులంలో 9వ తరగతిలో ప్రవేశాల కోసం, ఖమ్మం లోని గిరిజన సంక్షేమ గురుకులం, పరిగిలో ఎస్ఓఈలలో 8 వ తరగతి, అలుగునూరులోని సీఓఈలో 9వ తరగతి, రుక్మాపూర్ సైనిక్ స్కూల్, మల్కాజ్ గిరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ లో 6 వ తరగతిలో ప్రవేశాల కోసం ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా గడువులోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని విద్యార్థిని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed