రాజకీయాలకతీతంగా అభివృద్ధికి సహకరించాలి.. ఎమ్మెల్యే

by Sumithra |
రాజకీయాలకతీతంగా అభివృద్ధికి సహకరించాలి.. ఎమ్మెల్యే
X

దిశ, ఆమనగల్లు : ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం ఆమనగల్లు మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నిధులు రూ.83 లక్షలతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు మున్సిపల్ పాలకవర్గంతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలుకు అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు మున్సిపల్ పాలకవర్గం, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సహకరించాలని కోరారు. ప్రజల సహకారంతో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని హామీలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ వసంత, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు, లక్ష్మణ్, విక్రమ్ రెడ్డి, జ్యోతి నర్సింహా, కమాటం రాధమ్మ వెంకటయ్య, యాదమ్మ శ్రీశైలం, ఝాన్సీ శేఖర్, చిన్నకేశవులు, కృష్ణ, విజయకృష్ణ, పీసీసీ సభ్యులు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ సభ్యులు శ్రీశైలం, రంగయ్య, రమేష్, కాంగ్రెస్ నాయకులు, జగన్, శివలింగం, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed