- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైతే అధికారులకు పట్టింపు లేదా ?
దిశ, దేవరకొండ : దేవరకొండ నియోజకవర్గం మారుమూల ప్రాంతమైన నేరేడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీ గ్రామపంచాయతీలో గ్రామసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి తీరే వేరు. వైజాగ్ కాలనీ గ్రామపంచాయతీ పరిధిలో ఎన్ఎస్పీ భూములను అక్రమంగా ఆక్రమించి లే అవుట్లు చేసి సర్పంచ్ అనుకుంటున్నా గాని, పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి, మండల స్థాయి అధికారులు, ఇది జరిగి దాదాపుగా నాలుగు నెలలు కావస్తున్నా గాని ఈ విషయాన్ని కొంత మంది మండల స్థాయి నాయకులు పై అధికారుల దృష్టికి తీసుకుపోయిన కానీ చూసి చూడనట్లు వివరిస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు లోకసాని కృష్ణ అన్నారు.
వివరాల్లోకి పోతే నేరేడుగోమ్ము మండలం వైజాగ్ కాలనీ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 134, 139, 140 గల నెంబర్లో సుమారుగా రెండు ఎకరాల ఎన్ఎస్పీ ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసి, ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా లే అవుట్లు చేసి ఏదేక్షంగా అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలే కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. రెవెన్యూ, ఎంపీడీఓ, అధికారులు అక్రమ పద్ధతిలో ముడుపులు తీసుకుని అక్రమార్కులను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనితో స్థానిక రెవెన్యూ అధికారుల అండదండలు మెండుగా ఉన్నట్లు ఆయా ప్రాంత వాసులలో గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమి కబ్జాలను ప్రారంభ దశలోనే నిలిపి వేయాల్సిన అధికారులు మాత్రం ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం పూర్తికావస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు, తమకేమీ సంబంధం లేనట్లుగా చూడడం సరైన చర్య కాదని పలువురు వాపోతున్నారు. ఇదిలా ఉండగా ఇందులో ప్రజాప్రతినిధుల పాత్ర భారీ స్థాయిలో ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చలనం లేని ప్రభుత్వ అధికారులు...
వైజాగ్ కాలనీ గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న బాలరాజు గతంలో వైజాగ్ కాలనీలో అక్రమంగా ఏర్పాటు చేసిన లేఔట్ లో అక్రమంగా నిర్మిస్తున్న వారికి అక్రమ నిర్మాణం చేపట్టరాదని రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులను అక్రమ దారులు బేకాతలు చేస్తూ గ్రామ ముఖ్యరాజకీయ నాయకుల అండదండలతో అక్రమ నిర్మాణాన్ని చేపడుతున్నారు. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న వైజాగ్ కాలనీ పంచాయతీ కార్యదర్శి ఏం చేయలేక, పై అధికారులకు చెప్పిన వారి నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో మూడో నోటీసు కూడా అక్రమణ దారులకు భయపడి అందించలేదు అని తెలుస్తుంది. గ్రామసర్పంచ్ దూడ బావోజికి పలుమార్లు ఈ విషయం తెలియజేసిన ఆయనలోని స్పందన లేదని కార్యదర్శి వాపోయారు.
ఈ విషయమై కార్యదర్శి సర్పంచ్ కి పై అధికారులకు ఎంపీడీవో, ఎంపీవో లకు తెలియజేసిన వారు ఆ వ్యవహారంలో అంటి ముట్టనట్లుగా చూస్తున్నారు. అక్రమ నిర్మాణాన్ని ఆపే అధికారం ఎంపీడీవోలకు కాకుండా గ్రామపంచాయతీ కార్యదర్శికి అన్ని అధికారాలు ఉన్నాయి. కానీ కొందరి రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల పై అధికారుల ఒత్తిడి వల్ల అధికారుల సహకారం లేకపోవడంతో గ్రామ కార్యదర్శి బాలరాజు భయపడి నిర్మాణాలు జరుగుతున్న వ్యక్తులకు మూడవ నోటీసు ఇవ్వకుండా అక్రమంగా నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా నాలుగు నెలల నుండి రోజు చూస్తూ ఉండిపోతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పనిచేయవలసిన ఉద్యోగి, రాజకీయ ఒత్తిళ్లకు పై అధికారుల సహకారం లేక ఈ చిన్న ఉద్యోగం పోతే నా కుటుంబ జీవనానికి ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో ఎవరిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా మిన్న కుండిపోతున్నాడు.
పంచాయతీ కార్యదర్శి ఉద్యోగ విధులేంటి !
జీవో నెంబర్ 4 పరంగా శాఖ (మండల) ద్వారా పంచాయతీ కార్యదర్శుల కర్తవ్యాలకు సంబంధించిన నియమాలు జారీ చేయబడ్డాయి. పై ఆదేశాల ప్రకారం పంచాయతీ కార్యదర్శి గ్రామపంచాయతీ పరిధిలోని నివసించాలి. గ్రామపంచాయతీ పరిపాలన విధులు సర్పంచ్ ఆదేశాల మేరకే పంచాయతీని సమావేశపరచాలి. పంచాయతీ సమావేశాలు ఇతర కమిటీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలి. పంచాయతీ కమిటీల తీర్మానాలను అమలు చేయాలి. ప్రభుత్వ పంచాయతీ ఆస్తులకు, భూములకు, రక్షణ కల్పించాలి.
గ్రామ చావడీలను నిర్వహించాలి. ప్రభుత్వ భూములను, భవనాలను, ఇతర ఆస్తులను అన్యాక్రాంతం జరిగినప్పుడు ఇతరులు దుర్వినియోగం చేసినప్పుడు పై అధికారులకు తెలియజేయాలి. పంచాయతీకి అవసరమైన రిజిస్టర్లు నిర్వహించాలి. పంచాయతీ పన్నులను సక్రమంగా నూటికి నూరు పాలు వసూలు చేయాలి. గ్రామరికార్డులు అకౌంట్లు సక్రమంగా సకాలంలో నిర్వహించాలి. 100% పంటల అజమాయిషి సర్వే రాళ్లను తనిఖీ చేయాలి.
ఆర్డీవో వివరణ..
ఈ విషయమై రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) గోపిరాం వివరణ అడగగా గతంలోనే ఈ భూమిని రెవెన్యూ అధికారులు ఎన్ఎస్పీ వారికి అప్పజెప్పడం జరిగినది. ఆ భూమిని వారే కాపాడుకోవాలి. కానీ దానికి మాకు ఎలాంటి సంబంధం లేదని తెలియజేశారు. ఒకసారి రెవెన్యూ వాల్లు ఎవరికైనా భూమి అప్పజెప్పితే ఆ గ్రామ పరిధిలోని ఆ భూమిపై గ్రామ సెక్రెటరీకి ఫుల్ పవర్స్ ఉంటాయి. అది ఆ గ్రామానికి సంబంధించింది కాబట్టి గ్రామ పెద్దలు పంచాయతీ సెక్రెటరీ చూసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు.