- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాలేరు జేఎన్టీయూ కు రూ.108.60 కోట్ల నిధులు విడుదల
by Aamani |
X
దిశ, ఖమ్మం రూరల్: పాలేరు ప్రజలకు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరో తీపి కబురును అందించారు. పొంగులేటి చొరవతో ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామంలో జేఎన్టీయూ నూతన భవన నిర్మాణానికి రూ. 108 కోట్ల 60 లక్షల నిధుల విడుదల చేస్తూ.. ప్రిన్సిపాల్ సందీప్ కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏండ్లుగా కలగా ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థుల కలను సాకారం చేస్తూ నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం పట్ల పాలేరు ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృషి ని పలువురు కొనియాడుతున్నారు.
Advertisement
Next Story