- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి..
దిశ,చింతపల్లి (దేవరకొండ) : వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందిన ఘటన బుధవారం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే దేవరకొండ మండలం మర్రిచెట్టు తండా కు చెందిన మూడవత్ నందిని మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో ప్రసూతి కోసం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు ఆపరేషన్ చేయగా మగ శిశువు జన్మించాడు. శిశువుకు పరిస్థితి బాగాలేదు అంటూ హైదరాబాదుకు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు.
హైదరాబాద్ కి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బిడ్డ మరణించాడని మృతి చెందిన తర్వాత తమకు సీరియస్ గా ఉంది హైదరాబాద్ కి తీసుకెళ్లాలని చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న బంధువులు దేవరకొండ ప్రభుత్వాసుపత్రి కి చేరుకొని ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగడంతో దేవరకొండ పోలీస్ సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. డ్యూటీలో ఉన్న డాక్టర్లపైన నర్సులపైన చర్యలు తీసుకోవాలని బంధువులు ఆరోపణ చేస్తున్నారు.