- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటు…: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి
దిశ, నకిరేకల్ : సీఎం రేవంత్ రెడ్డి వలిగొండ మండలం సంగం వద్ద చేపట్టే మూసి పునర్జీవ పాదయాత్రలో రైతుల బాధలను చెప్పేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. ధాన్యం పత్తిని కొనుగోలు చేయకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదానితో కుమ్మక్కై రామన్నపేట మండలం లో అంబుజా సిమెంట్ కంపెనీకి అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. పాదయాత్రను అడ్డుకునేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను చిట్యాల శివారులో అరెస్టు చేసి మునుగోడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలను ఎక్కడికి అక్కడే అరెస్టులు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటును విరమించుకోవాలని పునరుద్ఘాటించారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిలో 20% కూడా రేవంత్ రెడ్డి చేయలేరన్నారు. యాదాద్రి దేవస్థానాన్ని చూస్తే కేసీఆర్ గుర్తు రావాలన్నారు. పాలన చేయలేక కేటీఆర్ హరీష్ రావు లను అరెస్టులు చేస్తామని బెదిరిస్తున్నారు అన్నారు. అరెస్టులకు ఎవరు భయపడరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆర్ గ్యారంటీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాడుతామని హెచ్చరించారు. మూసీ పునర్జీవనం పేరుతో రూ.150000 కోట్లను దండుకునేందుకు రేవంత్ రెడ్డి ఆలోచన చేశారని విమర్శించారు. దోచుకోవడం దాచుకోవడం ఈ ప్రభుత్వం చేస్తుందన్నారు. పోలీసుల చేత అక్రమ అరెస్టులు చేపించి ఎన్నాళ్ళు పాలన చేస్తారో చూస్తామని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో మళ్ళీ మంచి రోజులు వస్తాయన్నారు.