ఆ స్టార్ హీరోయిన్‌తో మెగా హీరో పెళ్లి.. సైలెంట్‌గా అలా కలిసి పోయిందిగా అంటున్న నెటిజన్లు..

by Kavitha |   ( Updated:2024-11-08 09:02:33.0  )
ఆ స్టార్ హీరోయిన్‌తో మెగా హీరో పెళ్లి.. సైలెంట్‌గా అలా కలిసి పోయిందిగా అంటున్న నెటిజన్లు..
X

దిశ, సినిమా: ప్రస్తుతం కాలంలో సెలెబ్రిటీలు వారి కో యాక్టర్స్‌ని ప్రేమించి పెళ్ళిళ్లు చేసుకుంటున్నారు. మరికొంత మంది కలిసి సినిమాల్లో నటించకున్న అభిప్రాయాలు కలవడంతో ఏడడుగులు వేస్తున్నారు. అలా పెళ్లి చేసుకుంటున్న వారిలో నాగ చైతన్య, శోభిత కూడా ఉన్నారు. ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ ఇంకా బ్యాచిలర్స్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ మెహ్రీన్‌తో ప్రేమలో ఉన్నట్లు, అల్లు శిరీష్ తన ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుంటున్నట్లు పలు పుకార్లు నెట్టింట షికారు చేశాయి. ఈక్రమంలో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ పెళ్లి రూమర్స్‌ కూడా జోరందుకున్నాయి. ఓ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడంటూ సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరి వైష్ణవ్ తేజ్‌తో ఏడడుగులు వేసే ఈ భామ మరేవరో కాదు హీరోయిన్ రీతూ వర్మ. స్టైలిష్‌గా అందంగా కనిపిస్తూనే రీతూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గ్లామర్ విషయంలో హద్దుల్లో ఉంటూ నటిస్తోంది. అయితే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం జరిగినప్పుడు కుటుంబ సభ్యులు మాత్రమే పెళ్ళిలో పాల్గొన్న సంగతి తెలిసిందే. కానీ, రిసెప్షన్‌కి టాలీవుడ్ ప్రముఖులు అంతా హాజరయ్యారు. అలా వీరి పెళ్ళిలో రీతూ వర్మ కూడా సందడి చేసింది. చివరికి మెగా ఫ్యామిలీ ఫొటోస్‌లో కూడా రీతూ వర్మ కనిపించింది. దీంతో అప్పటి నుంచి వైష్ణవ్, రీతు ప్రేమించుకుంటున్నారనే రూమర్స్ మొదలయ్యాయి. అలాగే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ చాలా మంది అనుకుంటున్నారు. అంతేకాకుండా వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇక దీనిపై నెటిజన్లు.. అతిథిగా వచ్చి.. సైలెంట్‌గా మెగా కోడలు కాబోతుందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story