- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
‘ప్రజా సమస్యలు పరిష్కరించలేని ఆయనకు జీతమెందుకు?’.. ఎమ్మెల్సీ భూమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: గత వైసీపీ(YCP) హయాంలో రాష్ట్రం నష్టపోయిందని టీడీపీ ఎమ్మెల్సీ(TDP MLC) భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి(BhumiReddy Ramgopal Reddy) మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం(AP Government)లో రాష్ట్రం అభివృద్ధి(Development) పథంలో సాగుతుందన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం(TDP Office)లో నిర్వహించిన మీడియా సమావేశంలో భూమిరెడ్డి మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన మాజీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఎలా అక్రమాలు చేయాలో జగన్‌కు తెలిసినట్లు మరెవరికీ తెలియదని ఎమ్మెల్సీ భూమిరెడ్డి ఎద్దేవా చేశారు.
బ్యాలెట్ పద్ధతి(Ballot method)లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నారని ప్రశ్నించారు. గౌతమ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి ఎందుకు వెనక్కి తగ్గారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి నిలదీశారు. ఎన్నికల్లో పాల్గొనకుండా, అసెంబ్లీకి రాకుండా జగన్‌కు రాజకీయ పార్టీ ఎందుకని ఫైరయ్యారు. పులివెందులలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించలేని ఆయనకు జీతమెందుకు? వెంటనే రాజీనామా చేస్తే పులివెందులకు మరో ఎమ్మెల్యే వస్తారని మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్సీ భూమిరెడ్డి విమర్శలు గుప్పించారు.